గత జ్ఞాపకాలను చెరిపేయండి-జన్మను సార్ధకం చేసుకోండి
మానవుడు ఈ పృద్వీ మీదకు తమ పాఠాలు నేర్చుకుని ప్రకృతిని వికాసం తేజ వికాసంతో
ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. కానీ నాలుగు దిక్కుల నుండి వచ్చే నకారాత్మక తరంగాలు అతనిని భీతులుగా చేస్తూ ఉండటం వలన మనసు భారం అవుతోంది. జ్ఞాపకాల్లో దాగి వున్న గాయముల వలన అశాంతితో తన జీవితాన్ని సార్ధకం చేసుకోలేకపోవుచున్నాడు.
మనం ఈ బహిర్గత కారణాల వలన రాబోయే నాకారాత్మకతను ఆపగలమా? లేదు కదా ! మరి మనం ఈ భారాన్ని బరువుగా కాకుండా కష్టాలను కూడా తేలిక భావనతో మనం ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులలో కూడా ఇలాంటి శుభకరమైన కోరికలను జాగృతపరిచి జీవితాన్ని సార్ధకం చేయగలగాలి. దీనికి సమాధానం ఏమంటే పాత జ్ఞాపకాలకు మందువేసి, జీవితానికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అయితే ఇది ఎలా? ఈ పుస్తకమే దీనికి జవాబు.
ప్రకృతి యొక్క ప్రియమైన కార్యప్రణాళిక అర్ధం చేసుకోండి. ప్రకృతి యొక్క లోతైన రహస్యాలు మీ ఎదురుగా ప్రకటితం కాబోతోంది. దీన్ని అర్ధం చేసుకున్నాక, మీరు జీవితంలో ఏమీ నేర్చుకోవడానికి వచ్చారో దాన్ని నేర్చుకోవడం ప్రారంభిస్తారు.
ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఈ ప్రకారం వున్నాయి.
శరీరము – మనస్సు మీద భారం పెరగటానికి నాలుగు ముఖ్య కారణాలు.
కర్మ బంధనాలను తుడిచివేసే ప్రభావవంతమైన పద్దతి.
జీవితంలోని చెడు అనుభవాల ప్రభావం, వాటిని చెరపగలిగే ఉపాయం.
గాయపడిన జ్ఞాపకాలను సరిచేసుకోగలిగే మార్గం – గుణపాఠాలు. గుణపాఠాలు నేర్చుకోవడానికి ప్రకృతి ద్వారా ఇవ్వబడిన విశేష వ్యవస్థ, మనుష్యులు, ఘటనలు, పరిస్థితులు.
పదండి ముందుకు, పుస్తకాన్ని తెరిచి జ్ఞాపకాలకు మందువేసి, జీవితాన్ని అభివృద్ధితో జీవితం యొక్క ఉపచార నియమాన్ని చేసుకునే నియమాలను తెలుసుకొని గుణపాఠాలను నేర్చుకుందాం.
Reviews
There are no reviews yet.